చొప్పదండిలో గణేష్ నిమజ్జనం పై మండల స్థాయి సమావేశం

చొప్పదండి మండలంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మండల స్థాయి కార్యనిర్వాహక సమావేశం మండల పరిషత్ కార్యాలయం లో శనివారం జరిగింది. గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిమజ్జన ప్రాంతాల ఎంపిక, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. డీజేల వాడకం నిషేధం, డ్రైవర్లు మద్యం సేవించరాదని పోలీసులు సూచించారు. ఎత్తైన విగ్రహాల తరలింపునకు విద్యుత్ శాఖ సహాయం తీసుకోవాలని, నిమజ్జనం వద్ద పెద్దలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఎంపిడిఓ వేణుగోపాల్, ఎస్ఐ నరేష్ రెడ్డి, ఫైర్, ట్రాన్సకో ఏఈ లు, పలువురు అధికారులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕