చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో గురువారం జరుగబోయే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ పడమర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి లతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, జిల్లా మరియు మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వారు సమీక్షించారు.