లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుళ సేవా కార్యక్రమాలు

చొప్పదండిలో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాకర్స్ గ్రౌండ్లో మధుమేహంపై అవగాహన కల్పించి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యులను, పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా పోస్టల్ సిబ్బందిని, చార్టెడ్ అకౌంటెంట్ డే సందర్భంగా కట్ల అరుణ్ ను సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత ముఖ్య అతిథిగా హాజరై లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు. క్లబ్ అధ్యక్షులు వల్లాల జగన్, కార్యదర్శి దూస రాము, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్