చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలోని అంగన్వాడి కేంద్రం 1 లో జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తల్లులకు పోషణ ప్రాముఖ్యత గురించి వివరించారు. బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. తల్లులు కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. అంగన్వాడి టీచర్లు లక్ష్మీ, శైలజ, అమృత, మనీషా, సరోజ, ఐకెపి సీఏ తార, సీసీ చంద్ర నారాయణ పాల్గొన్నారు.