చొప్పదండిలోని రామడుగు మండలం గోపాల్ రావు పేటలో ఆదివారం పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘం నూతన కార్యవర్గాల ప్రమాణస్వీకారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం మాట్లాడుతూ, పద్మశాలీలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. నూతన కార్యవర్గంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులుగా కొలిపాక మల్లయ్య, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుగా అలువాల విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు.