నిమజ్జనం కోసం ఎస్ఆర్ఎస్పి నీటిని విడుదల చేయండి..ఎమ్మెల్యే

కరీంనగర్ జిల్లా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గణేష్ నవరాత్రులు పూర్తవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం విగ్రహాల నిమజ్జనం కోసం SRSP ప్రాజెక్టు నుండి కాలువలకు నీటిని విడుదల చేయాలని SRSP ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను సోమవారం ఆదేశించారు. గత కొన్నేళ్లుగా గణేష్ విగ్రహాలను కాకతీయ కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో నిమజ్జనం చేస్తున్నారని, కాలువల్లో నీటి సరఫరా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తామని చీఫ్ ఇంజనీర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕