గంగాధర: పారిశుద్ధ్యంపై పాలకులు దృష్టి సారించాలి: మాజీ ఎమ్మెల్యే

గ్రామాల్లో పారిశుద్ధ్యంపై పాలకులు దృష్టి సారించాలని మాజీఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. శనివారం గంగాధర మండలం పెండలోనిపల్లిలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, అదేవిధంగా డ్రైనేజీలోని చెత్తను స్వయంగా తానే తొలగించి ట్రాక్టర్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్