గల్ఫ్ ఏజెంట్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు.. ఎస్సై రమాకాంత్

బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన కమటం కాంతవ్వ కుమారుడు కమటం వెంకటేష్‌ను, కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన తునికి శేఖర్ అనే గల్ఫ్ ఏజెంట్ తాను మోసం చేసి మూడు లక్షల రూపాయలు తీసుకొని సౌదీ అరేబియాకు పంపించాడు. అక్కడ సరైన ఉద్యోగం చూపించకుండా మద్యం విక్రయాలు జరిగే ప్రదేశంలో వదిలేయడంతో, పోలీసులు దాడి చేసి జైలుకు పంపించారు. ఈ విషయంపై కాంతవ్వ తునికి శేఖర్‌ను ప్రశ్నించగా, అతను కులం పేరుతో దూషించాడు. మేకల మల్లేశం, గంటల మల్లారెడ్డి, ఊకంటి రమణారెడ్డి, పంగ రవి, తునికి శారదలు మధ్యవర్తులుగా వ్యవహరించి, సమస్య పరిష్కరిస్తామని చెప్పి, ఉద్దేశ్యపూర్వకంగా తునికి శేఖర్‌ను విదేశాలకు పంపినట్లు కాంతవ్వ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్