చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారులు మున్సిపాలిటీ గుర్తించిన గ్రీన్ జోన్ పరిధిలోనే తమ విక్రయాలు జరుపుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం టీవీసీ సమావేశం నిర్వహించి పట్టణంలోని గుమ్లాపూర్ ఎక్స్ రోడ్డు నుండి నవోదయ స్కూల్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించామని ఈ పరిధిలో రోడ్డుకు ఇరు వైపులా ఎలాంటి వీధి విక్రయాలు చేయరాదని తెలిపారు.