ఆడపిల్లలను వేధిస్తే కఠినంగా చర్యలు ఉంటాయి

గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలను వేధించిన ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. శుక్రవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలను వేధిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. పాఠశాలల్లో సమస్యలుంటే తనకు సమాచారం ఇవ్వాలని, అండగా ఉండి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్