కరీంనగర్ జిల్లా, చొప్పదండిలోని సైనిక్ స్కూల్‌లో బుధవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఎస్‌ఐ, చొప్పదండి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటిపి మోసాలు, ఫిషింగ్ లింకులు, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు, UPI/బ్యాంకింగ్ మోసాలు, సైబర్ బుల్లీయింగ్, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు.