విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలి : ఎస్ఐ

చొప్పదండిలోని వీణాధరి హైస్కూల్ క్రీడా మైదానంలో విద్యార్థుల కోసం నిర్మించిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ను ఎస్ఐ నరేష్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ముచ్చర్ల గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕