బోయినపల్లి మోడల్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ.. ఇంచార్జి కలెక్టర్

బోయినపల్లి మోడల్ స్కూల్ లో మంగళవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, విద్యాలయం ఆవరణ, మధ్యాహ్న భోజనం మెనూ, తయారీని పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. సిలబస్ ఫిబ్రవరిలో పూర్తి చేసి, వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులు ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడేలా సిద్ధం కావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్