కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం ఆర్నకొండలో ఆదివారం గడ్డం తిరుపతి రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి వారి సొంతింటి కలను నిజం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీసీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.