ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించగలం..

బోయిన్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్లో శుక్రవారం, బోయిన్పల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ కార్తీక్ బృందం బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసింది. డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించగలమని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్ టెక్నిక్, ఎనీమియాపై అవగాహన కల్పించారు. హాస్టల్ కిచెన్ ను పరిశీలించి, పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని వంట వర్కర్లకు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్