చొప్పదండిలో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బుధవారం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్