ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగిని అధికారులు గుర్తించి శుక్రవారం సస్పెండ్ చేశారు. బుగ్గారం మండలం చందయ్య పల్లె కార్యదర్శి రాజన్న విధులకు హాజరు కాకుండా యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేశాడు. కాగా, పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగించే యాప్ ను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.