పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఔట్‌సోర్స్ డ్రైవర్ తోట శ్రీకాంత్ (32) మృతిచెందాడు. బుధవారం రాత్రి జాఫరాఖాన్పేటకు బైకుపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మరో బైక్ అతన్ని ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే శ్రీకాంత్ చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.