జగిత్యాల జిల్లా, పెగడపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం చిన్నారులకు సర్పంచ్ అరుణతో కలిసి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏసీడీపీవో అరవింద అన్నప్రాశన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాం, మూడేళ్లలోపు వారికి పోషకాహారాలు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అరవింద కోరారు. కార్యక్రమంలో మండల సూపర్వైజర్ మహేశ్వరి పాల్గొన్నారు.