16న పెద్దపల్లికి రాష్ట్ర మంత్రుల రాక

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీ బుధవారం రోజున ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావులు రానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయరమణరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్