అయోధ్య కాలని రోడ్ నెంబర్ -2 లో ఘనంగా కుంకుమ పూజ

కరీంనగర్ పట్టణం కట్టారాంపూర్ అయోధ్య కాలనీ రోడ్ నెంబర్ -2 లో ఈరోజు గణపతి మండపంలో కుంకుమ పూజను సోదరి,సోదరి మణులు మరియు కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. కుంకుమ పూజ మహోత్సవం నిర్వహించడం వలన మహాలక్ష్మి దేవి కృప కటాక్షాలు, అమ్మ వారి ఆశీస్సులు అందరి పైన  ఉండాలని, కొలవడం వలన సకల సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అయోధ్య కాలనీ ప్రెసిడెంట్ బొమ్మరవేణి తిరుపతి, కాలనీ కమిటీ సభ్యులు సంపత్ కుమార్,శేఖర్ రెడ్డి, సదానధo, షణ్ముఖ చారి, సూర్య ప్రకాష్, ఆంజనేయులు, ప్రమోద్ కుమార్, అంజి రెడ్డి, రమేష్, దామోదర్, శంకర్,కిషోర్, శ్రీకాంత్, సాగర్, సూరజ్, రిషికేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕