కరీంనగర్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని నరేందర్ రెడ్డి అన్నారు.