హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఎన్హెచ్-563 జాతీయ రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎత్తు సుమారు 5 అడుగుల 7 అంగుళాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడు బ్లూ చెక్స్ షర్ట్, డార్క్ బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉండగా, మెడలో తాయత్తు ఉన్నట్లు తెలిపారు. అయితే మృతుడి వివరాలు, ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుడిని గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.