రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో ఆదివారం, 26 ఏప్రిల్ 2026న, కేంద్ర సెన్సెస్ 2027 సర్వేలో భాగంగా సెల్ఫ్ ఏనుమరేషన్ ప్రక్రియను తహసీల్దార్ సురేష్ కుమార్ ప్రారంభించారు. ముస్కానిపేట సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఎలగందుల ప్రసాద్ ఇంటి వద్ద ఈ ప్రక్రియను లాంచ్ చేసి, వారి సెల్ఫ్ ఏనుమరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రజలు se.census.gov.in లో వివరాలు నమోదు చేసి, ID నంబర్ ను సర్వే టీంకు సమర్పించాలి. సర్వే టీం మే 11 నుండి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.