ఎక్సెల్ బండి అదుపుతప్పి కిందపడి రైతు మృతి

వీణవంక మండల ఘన్ముకుల గ్రామంలో కొంక నర్సయ్య (65) అనే రైతు సోమవారం ఉదయం తన వ్యవసాయ భూమి వద్ద పని ముగించుకుని 20 అడుగుల ప్లాస్టిక్ పైపును ఇంటికి తీసుకువస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. పైపును కుడి భుజంపై పెట్టుకుని, మెడకు కాటన్ తువాలతో కట్టుకున్నాడు. గాలికి బండి అదుపుతప్పి పైపు భూమికి తగలడంతో, మెలికలు తిరిగిన తువాలు మెడకు బిగుసుకుని నర్సయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్