హజురాబాద్ పట్టణంలోని శ్రీ వాసవీ మాత కన్యకా పరమేశ్వరీ ఆలయంలో గురువారం వాసవీ మాత రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు అమ్మవారికి కలశ జలాలచే కుంభాభిషేకం, చండీ హోమం, ప్రత్యేక పూజలు చేశారు. సాయంకాలం మహిళా భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారిని దర్శించుకొన్నారు. లలితా సహస్ర నామ పారాయణం పఠించారు. కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ ఛైర్మెన్, కమిటీ సభ్యులు భక్తులందరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.