హుజురాబాద్ కో-ఆప్షన్ కాంగ్రెస్ వశం

హుజురాబాద్ మున్సిపల్‌లోని నాలుగు కో-ఆప్షన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. యువనేత వొడితల ప్రణవ్ నేతృత్వంలో బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ సమతుల్యత పాటించారు. ఎంపికైన కో-ఆప్షన్ సభ్యులలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గొట్టే జమదగ్ని, మహమ్మద్ అబ్దుల్ అలీం, ఆలేటి సుశీల, ఫరీద బేగం ఈ పదవులకు ఎంపికయ్యారు. ఈ విజయంతో హుజురాబాద్ మున్సిపల్‌పై కాంగ్రెస్ తొలిసారి ఆధిపత్యం సాధించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, తుమ్మల, డీసీసీ అధ్యక్షుడు సత్యంలకు ఇంచార్జి ప్రణవ్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్