వీణవంక మండలం కొండపాక గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన భారీ ఇసుక దంపులపై ఎస్ఐ అవుల తిరుపతి సిబ్బందితో కలిసి శనివారం మెరుపు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో జరిగిన ఈ దాడుల్లో 60 ట్రిప్పుల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సల్లల సమ్మయ్య, నాగుల రాజు, ఆవాల గిరిబాబు, మేడదుల రాజు, నలగాశు శ్రీనులకు చెందిన ఇసుక దంపులను సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం ఎమ్మార్వోకు సమాచారం అందించారు. మండలంలో అక్రమ ఇసుక రవాణా, నిల్వలు సహించేది లేదని, ఉల్లంఘిస్తే ట్రాక్టర్లు సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.