కరీంనగర్: భారీ వర్షాలు.. నిలిచిన రాకపోకలు

మొంథా తుపాను ప్రభావంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో భారీ వర్షాలు కురిశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వెనుకేపల్లి కట్టు కాలువకు గండి పడింది. ఆకునూరు, గొల్లగూడెం గ్రామాల మధ్య వరద ప్రవాహం అధికంగా ఉండటంతో కల్వర్టు తెగిపోయింది. సైదాపూర్, హుజురాబాద్, ఆకునూరు, పెరికపల్లి, మొలంగూర్, రాములపల్లి గ్రామాల మధ్య కల్వర్టులపై రెండు మీటర్ల మేరకు వరద ప్రవాహం ఉండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

సంబంధిత పోస్ట్