హుజూరాబాద్ మండలం చెల్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రామ సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ కత్తి నర్సయ్య అక్కడికక్కడే మరణించాడు. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.