కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆత్మకూరులో శుక్రవారం సబ్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.