కరీంనగర్: విషాదం.. వృద్ధుడు ఆత్మహత్య

హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తుమ్మ రాంరెడ్డి (65) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం తన వ్యవసాయ బావి వద్ద గడ్డి మందు తాగినట్లు ఆయన భార్య భాగ్యమ్మ తెలిపారు. బంధువులు హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాంరెడ్డి మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్