కరీంనగర్: స్తంభాన్ని ఢీకొన్న వాహనం.. ఒకరు మృతి

హుజూరాబాద్ మండలం చెల్పూర్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వైపు వెళ్తున్న తవేరా వాహనం అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తవేరా నడుపుతున్న భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపూర్కు చెందిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్