హుజూరాబాద్: కౌశిక్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారు: ప్రణవ్

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ అవకాశవాదని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ఆదివారం అన్నారు. ఓ వైపు బీజేపీని విమర్శిస్తూనే మరోవైపు వారితో దోస్తానా చేస్తున్నాడని ఆరోపించారు. అతని తీరు చూస్తుంటే త్వరలో బీజేపీలో చేరతాడనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ భూస్థాపితం కానుందన్నారు. ప్రజలు ఆయనను నిలదీసే రోజులు ముందున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్