41 సార్లు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన నరేశ్

కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండల భూపాల పట్నం గ్రామానికి చెందిన నరేశ్ అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ, ప్రతి మూడు నెలలకి క్రమం తప్పకుండా మొత్తం 41 సార్లు రక్తదానం చేసి విలువైన ప్రాణాలు కాపాడారు. రక్త దాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కొత్త రక్తదాతలను కూడా తయారు చేస్తున్నారు. జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తాన్ని అందించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, యువత కూడా సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వాలని అన్నారు.

సంబంధిత పోస్ట్