కొత్తపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీ, సైకిలిస్టుకు తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం కొత్తపల్లి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపెళ్లి రెడ్డి కాలనీ సమీపంలో డివైడర్ మధ్య నుంచి సైకిల్పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని, కరీంనగర్ వైపు వెళ్తున్న హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ బ్లూ కోర్ట్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్