సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మలలో ఉద్యోగం రాకపోవడంతో నర్మల గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్ (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నత విద్య పూర్తి చేసి, పలు పోటీ పరీక్షలు రాసిన శ్రీకాంత్‌కు ఉద్యోగం లభించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చి, పొలంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకుని జీవితానికి ముగింపు పలికాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.