21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ రన్‌ను పూర్తీ చేసిన ఉపసర్పంచ్ దుస్స కుమార్

సైక్లింగ్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ రన్‌ను గొల్లగూడెం ఉప సర్పంచ్ దుస్స కుమార్ 2 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేశారు. మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సిద్దిపేట కమిషనరేట్ CCS ACP గడ్డం సదన్ కుమార్ చేతుల మీదుగా ఫినిషేర్ మెడల్ అందుకున్నారు.
దుస్స కుమార్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ చెయ్యాలని కుమార్ కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕