భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య!

భర్త వేధింపులకు విసిగిపోయిన శిరీషా రాణి అనే వివాహిత కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన శిరీషా రాణికి 2016లో కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన కుతాడి కిశోర్‌తో వివాహమైంది. అందంగా లేవని, రూ.5 లక్షల అదనపు కట్నం తేవాలని భర్త వేధిస్తున్నాడని శిరీషా తల్లిదండ్రులకు చెప్పేవారు. సోమవారం భర్త మద్యం తాగి రావడంతో, మద్యం మానేస్తావా లేదా విషం తాగుతావా అని ఆమె ప్రశ్నించారు. అనంతరం కిశోర్ గడ్డి మందు తాగితే తాగు, నేను మద్యం మాననని అన్నాడని శిరీషా తల్లి లక్ష్మికి ఫోన్లో చెప్పారు. తల్లి వచ్చేలోపే గడ్డి మందు తాగడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్