వివాహేతర సంబంధం నైపథ్యంలో యువకుడు దారుణ హత్య

హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామ ఎస్సారెస్పీ కాలువ సమీపంలో ఆదివారం రాత్రి వివాహేతర సంబంధం నేపథ్యంలో వడిగే రాకేశ్ (32) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన రాకేశ్‌ను, అదే గ్రామానికి చెందిన అంబరగొండ ప్రశాంత్ హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితుడి భార్యతో రాకేశ్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానమే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్య వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕