జాబితాపూర్ లో గుండెపోటుతో వ్యక్తి మృతి

జగిత్యాల మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున బండారి రామన్న (45) అనే వ్యక్తి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. తెల్లవారుజామున తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్న రామన్నను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మధ్యవయసులోనే ఆయన మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, బంధుమిత్రులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్