జగిత్యాల జిల్లాలో వృద్ధుడి ఆత్మహత్య కలకలం

జగిత్యాల జిల్లాలో వృద్ధుడి ఆత్మహత్య కలకలం రేపింది. మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన బినవేని బాగయ్య (70) శుక్రవారం ఉదయం మామిడితోటలో చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం మరింత క్షీణించడంతో మానసికంగా కుంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్