జగిత్యాల జిల్లా మల్యాలలో ఉపాధి హామీ కూలీలు ఆటవిడుపు కోసం సరదాగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మహిళా కూలీలు వధూవరులుగా మారి పెళ్లి తంతు జరుపుకోగా, మిగతా కూలీలు బంధువుల్లా సందడి చేశారు. ఈ సంఘటన నవ్వులు పూయించింది. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.