తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలువురు నేతలు రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ ఎన్నికల నాటికి తమ వారసులను బరిలోకి దింపాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ జాబితాలో ముందున్నట్లు సమాచారం. త్వరలో జీవన్ రెడ్డి తన కోడలు చరిష్మారెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి.. కోడలికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరానున్నారని సమాచారం.