జగిత్యాల జిల్లా కేంద్రంలోని రైతు బజార్ లో కౌన్సిలర్ అరవ లక్ష్మి భర్త ఏసిఎస్ రాజు సోమవారం రాత్రి కూరగాయల వ్యాపారులపై లైసెన్స్ లేదని దాడికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశాల మేరకే తనిఖీ చేస్తున్నానని వాదించాడు. వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించడంతో, పట్టణ సిఐ కరుణాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఏసిఎస్ రాజును అదుపులోకి తీసుకున్నారు.