కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలోని తన నివాసంలో కలసి, బీఆర్ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్, జీవన్‌రెడ్డిల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహాన్ని, గౌరవాన్ని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, జీవన్‌రెడ్డి అభ్యర్థన మేరకు రూ.70 కోట్ల బ్రిడ్జిని మంజూరు చేశారని, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం నుంచి రూ.250-300 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, దానికి జీవన్‌రెడ్డినే చైర్మన్‌గా ఉండాలని కేసీఆర్ శాసనసభలో చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది.