జీతం రాకపోవడంతోపాటు ధర్నా చేస్తూ గ్రామ పంచాయితీ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన ఆకుల రాజయ్య గుండెపోటుతో మృతి చెందాడు. అయితే 3 నెలలుగా జీతాలు రావట్లేదని పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న రాజయ్యకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది.