కొండగట్టు: పోలీసుల బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు, భక్తులు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్