బతికుండగానే సమాధి కట్టుకున్న వ్యక్తి కన్నుమూత

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల నక్క ఇంద్రయ్య, తాను జీవించి ఉండగానే తన సమాధిని తానే నిర్మించుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయన నిర్మించుకున్న సమాధి వద్దనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్