మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో ఆదివారం ఉదయం జరిగిన దారుణంలో ఎల్లా గంగనర్సయ్యపై ఆయన కొడుకు అన్వేష్ కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గంగనర్సయ్యను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా, సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.